Mon Nov 17 2025 09:32:24 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఫీజు రీఎంబర్స్ మెంట్ కమిటీ
ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానంపై అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానంపై అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకానికి సంబంధించి ప్రయివేటు కళాశాలలు బంద్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. అధ్యయనం చేసిన కమిటీ తర్వాత నివేదిక ఇవ్వనుంది.
అధ్యయన కమిటీలో...
కమిటీకి సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా కోదండరామ్, కంచ ఐలయ్య, ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తో పాటు ప్రయివేటు విద్యాసంస్థల నుంచి ముగ్గురిని కమిటీలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ దీనిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ప్రయివేటు విద్యాసంస్థలు కూడా కమిటీని ఏర్పాటు చేయాలని కోరడంతో వారి డిమాండ్ మేరకు ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది.
Next Story

