Fri Apr 10 2026 21:46:11 GMT+0530 (India Standard Time)
Telangana : 'వాహన్' పోర్టల్ లోకి తెలంగాణ.. అన్నీ ఆన్ లైన్ లోనే
తెలంగాణలో వాహన యజమానులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణలో వాహన యజమానులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాలకు సంబంధించి యజమానులకు తీపి కబురు అందించింది. ఇకపై ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలను తెలంగాణ ఆర్టీఏ కిందకు మార్చుకోవడానికి మార్గం సులువు తరం చేసింది. ఇందుకోసం వాహన్ పోర్టల్ ను అమలులోకి తెచ్చింది. దీంట్లో సులువుగా వాహనాలను ఓనర్ పేరు, అడ్రస్ లను మార్చుకోవచ్చు.
మార్చి 15 నుంచి...
కేంద్రం తీసుకొచ్చిన 'వాహన్' పోర్టల్లో మార్చి 15వ తేదీన చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఈ పోర్టల్లో పొందవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు కొన్నా అమ్మినా ఇక నుంచి ఓనర్ పేరు, అడ్రస్ మార్పులకు RTA ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్లోనే మార్చుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ హిస్టరీ, డూప్లికేట్ RC వంటివి ఇందులో పొందే అవకాశం ఉంటుంది.
Next Story

