Sat Dec 13 2025 22:35:18 GMT+0000 (Coordinated Universal Time)
రియాజ్ ఎన్ కౌంటర్ పై డీజీపీ ఏమన్నారంటే?
నిజామాబాద్ లో జరిగిన రియాజ్ ఎన్ కౌంటర్ పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు

నిజామాబాద్ లో జరిగిన రియాజ్ ఎన్ కౌంటర్ పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. నిజామాబాద్ లో రియాజ్ ఎన్ కౌంటర్ లో మరణించాడని డీజీపీ చెప్పారు. బాత్ రూమ్ కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి బయట కాపలా పోలీసుల వద్ద ఉన్న వెపన్ ను లాక్కునేందుకు రియాజ్ ప్రయత్నించారని డీజీపీ తెలిపారు. ఏఆర్ కానిస్టేబుల్ వద్ద ఉన్న లాక్కుని కాల్పులు ప్రయత్నించగా పోలీసులు అతనిపై కాల్పులు జరిపారన్నారు. రియాజ్ కాల్పులు జరపడం వల్లనే పోలీసులు ఎదురు కాల్పులుజరపాల్సి వచ్చిందని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు.
కాల్పులు జరపడంతో...
తాము కాల్పులు జరపకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులు ప్రాణాలు కోల్పోయేవారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరిపామని డీజీపీ తెలిపారు. రియాజ్ ఈ నెల 17న కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు. అతనిని నిన్న అదుపులోకి తీసుకుంటుండగా గాయపడటంతో రియాజ్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రియాజ్ ఎన్ కౌంటర్ జరిగిందని పోలీసులు ధృవీకరించారు. ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో ఈ ఎన్ కౌంటర్ జరిగిందని డీజీపీ చెప్పారు.
Next Story

