Fri Jan 30 2026 14:18:02 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు, ఏడు కార్పొరేషన్లకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. జనవరి 31వ తేదీన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3వ తేదీన నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు విధించారు.
పోలింగ్ ఫిబ్రవరి 11న...
ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ ఉండనుంది. రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12వ తేదీన నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పార్టీ గుర్తుల మేరకు ఈ ఎన్నికలు జరగననున్నాయి.
Next Story

