Fri Feb 27 2026 18:46:27 GMT+0530 (India Standard Time)
చిలుకూరు బాలాజీ ఆలయ మాజీ పూజారి సౌందర్ రాజన్ మృతి
చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ మరణించారు

చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ మరణించారు. ఆయన వయసు తొంభై ఏళ్లు. సౌందర్ రాజన్ గత కొంత కాలంగా అనరోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు చిలుకూరులోని ఆయన నివాసంలో కన్ను మూశారు. ఆయన తనయుడు, చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సౌందర్ రాజన్ మృతి గురించి తెలిపారు.
చిలుకూరు ఆలయాన్ని...
హైదరాబాద్ కు సమీపంలో ఉన్న చిలుకూరు ఆలయానని అన్నిరకాలుగా తీర్చి దిద్దిన సౌందర్ రాజన్ మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు అని చెబుతున్నారు. ప్రధానంగా వీసా కావాలంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రదక్షిణలు చేస్తే చాలు అని భక్తులు నమ్ముతారు. సౌందర్ రాజన్ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

