Sat Dec 13 2025 22:35:57 GMT+0000 (Coordinated Universal Time)
BRS : కాంగ్రెస్ పై ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారిని కలిశారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారిని కలిశారు. రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను, ఆధారాలను అందచేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిబంధనలను తుంగలోకి తొక్కి ఓటర్లను ప్రలోభపెడుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
వీడియోలు, ఫొటోలు...
బస్తీల్లో కొందరు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుందని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ నేతలు అంగీకరించారు. ఎన్నికల అధికారిని కలిసిన వారిలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, హరీశ్ రావులతో పాటు పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు.
Next Story

