Mon Feb 02 2026 03:38:37 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 3,877 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు.

తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 3,877 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,54,976 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,10,479 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 40,414 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,083 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో 1,189 కేసులు నమోదయ్యాయి.
Next Story

