Sat Mar 07 2026 17:26:23 GMT+0530 (India Standard Time)
Breaking : నెల రోజుల తర్వాత ఆమోదం
తెలంగాణ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు.

తెలంగాణ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ సిఫార్సులను, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడంతో ఆమె బిల్లుకు ఆమోదం తెలిపారు. అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్ కు వెళ్లిన బిల్లు నెల రోజుల తర్వాత గవర్నర్ ఆమోదం పొందడంతో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నెల రోజుల తర్వాత...
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అయినా ఇప్పటి వరకూ గవర్నర్ ఆమోదం పొందకపోవడంతో ఒకింత ఆందోళన ఆర్టీసీ కార్మికుల్లో బయలుదేరింది. అయితే కొద్దిసేపటి క్రితం ఎట్టకేలకు గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించడంతో ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

