Fri Dec 19 2025 02:27:22 GMT+0000 (Coordinated Universal Time)
కాసేపట్లో దీక్ష విరమణ
బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్షను ప్రకాష్ జవదేకర్ విరమింపచేస్తారు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో దీక్షను కొనసాగిస్తున్నారు. కాసేపట్లో ఆయన దీక్షను ప్రకాష్ జవదేకర్ విరమింపచేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిన్న ఇందిరాపార్క్ వద్ద కిషన్ రెడ్డి తలపెట్టిన దీక్ష ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతి ఉందని చెప్పి ఆయన దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నం చేశారు. ఇందిరా పార్కు వద్ద ఆయనను అరెస్ట్ చేసి పార్టీ కార్యాలయానికి తరలించారు.
రాత్రి ఉద్రిక్తతల మధ్య...
అయితే పార్టీ కార్యాలయంలో రాత్రి నుంచి దీక్ష ను కిషన్ రెడ్డి కొనసాగిస్తున్నారు. కిషన్ రెడ్డి దీక్ష భగ్నం సమయంలో తలెత్తిన ఉద్రిక్తతలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. కిషన్ రెడ్డి పోలీసులు తరలిస్తుండగా సొమ్మసిల్లిపడిపోవడంతో ఒకింత ఆందోళన కలిగింది. అయితే ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని బీజేపీ నిర్ణయించింది.
- Tags
- bjp
- kishanreddy
Next Story

