Fri Dec 19 2025 02:22:52 GMT+0000 (Coordinated Universal Time)
బాబుకు అండగా బీజేపీ
తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ భారతీయ జనతా పార్టీ కూడా స్పందించింది.

తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ భారతీయ జనతా పార్టీ కూడా స్పందించింది. చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్ట్ సబబు కాదన్న ఆయన ముందుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు చేర్చడమేంటని ప్రశ్నించారు. కనీసం చంద్రబాబు వివరణ కోరకుండా అరెస్ట్ చేయడాన్ని బీజేపీ తప్పుపడుతుందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
పార్లమెంటు సమావేశాల్లో...
అయితే ఈ నెలలో ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో కీలక నిర్ణయాలు ఉంటాయని లక్ష్మణ్ తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే ప్రత్యేక సమావేశాల్లో చరిత్ర పుటల్లో నిలిచిపోయే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. జమిలి ఎన్నికలు జరపాలన్నది ప్రధాని మోదీ అభిప్రాయమని, అందుకే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో కమిటీ వేశామన్నారు. ప్రజలకు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలనే తమ ప్రబుత్వం తీసుకుంటుందని లక్ష్మణ్ తెలిపారు.
Next Story

