Thu Mar 19 2026 10:26:21 GMT+0530 (India Standard Time)
బీజేపీ సభ్యుల సస్పెన్షన్... సమాశాలు ముగిసేంత వరకూ
రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు

రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగానికి పదే పదే అడ్డుతగులుతుండటంతో వారిని సస్పెండ్ చేశారు. హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటంతో బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు పెద్దయెత్తున నినాదాలు చేశారు.
సస్పెండ్ చేయాలంటూ....
దీంతో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ముగ్గురిని సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకూ బీజేపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో ముగ్గురిని మార్షల్స్ చేత బయటకు పంపారు.
- Tags
- bjp
- suspension
Next Story

