Thu Dec 18 2025 13:50:06 GMT+0000 (Coordinated Universal Time)
బడ్జెట్ కు ముందు హరీశ్‌రావు
బడ్జెట్ సందర్భంగా ఏటా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ గా వస్తుంది

బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏటా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ గా వస్తుంది. ఈసారి కూడా హరీశ్ రావు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్ ప్రతులను స్వామి వారి ముందు ఉంచి పూజలు నిర్వహించారు.
పూజలు నిర్వహించిన ...
అనంతరం ఆయన శాసనసభకు బయలుదేరి వెళ్లారు. ఈరోజు 10.30 గంటలకు శాసనసభలో హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సకల జనులకు ఆమోదయోగ్యంగా బడ్జెట్ ఉంటుందని హరీశ్ రావు తెలిపారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా బడ్జెట్ ను రూపకల్పన చేసినట్లు ఆయన వెల్లడించారు.
- Tags
- harish rao
- budget
Next Story

