Mon Mar 16 2026 00:48:08 GMT+0530 (India Standard Time)
సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్
తెలంగాణ శాసనసభ సమావేశాల నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది

తెలంగాణ శాసనసభ సమావేశాల నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అనుమతించలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఏకపక్షంగా స్పీకర్....
స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం సరికాదన్నారు. దీనిపై మాట్లాడేందుకు తమకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. అందుకే సభ నుంచి వాకౌట్ చేశామని ఆయన తెలిపారు.
Next Story

