Tue Dec 05 2023 22:20:23 GMT+0000 (Coordinated Universal Time)
Amit Shah : నేడు మూడు సభల్లో అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు మరోసారి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు

భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో మరింత స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలుమార్లు ప్రచారానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు. నేడు మరో మూడు బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. ఆయన హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుంచి నేరుగా జనగామకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
మ్యానిఫేస్టోను...
తర్వాత జనగామ నుంచి కోరుట్ల వెళతారు. కోరుట్లలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. కోరుట్ల నుంచి హైదరాబాద్ కు చేరుకుని ఉప్పల్ లో జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొననున్నారు. అమిత్ షా పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు నేతలు పూర్తి చేశారు. భారీ జనసమీకరణ చేయనున్నారు. రెండు రోజుల క్రితం మ్యానిఫేస్టోను విడుదల చేసిన అమిత్ షా దానిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నేడు మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు.
Next Story