Wed Feb 12 2025 08:24:57 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు నామినేషన్.. ఇంకా గడువు ఒకరోజు మాత్రమే కావడంతో?
నామినేషన్ల దాఖలకు ఇంకా ఒకరోజు మాత్రమే గడువు ఉంది. ఈరోజు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు

నామినేషన్ల దాఖలకు ఇంకా ఒకరోజు మాత్రమే గడువు ఉంది. దీంతో ఈరోజు పెద్దయెత్తున నామినేషన్లు దాఖలవుతున్నాయి. పెద్దయెత్తున నామినేషన్లు ఈరోజు దాఖలు కానున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు రెండు స్థానాల్లో నామినేషన్లు వేయనుననారు. ఉదయం పదకొండు గంటలకు గజ్వేల్ లో ఆయన నామినేషన్ వేస్తారు. తర్వాత ఆయన అక్కడి నుంచి కామారెడ్డికి వెళ్లి అక్కడ కూడా నామినేష్ వేస్తారు. కేసీఆర్ రాక సందర్భంగా పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు గులాబీ పార్టీ నేతలు.
కేటీఆర్ కూడా...
అలాగే ఈరోజు మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11.45 గంటలకు ఆయన సిరిసిల్లలోని ఆర్డీవో కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను అందించనున్నారు. అలాగే మరోమంత్రి హరీశ్ రావు సయితం ఈరోజు తన నామినేషన్ ను దాఖలు చేస్తారు. సిద్ధిపేటలో హరీశ్ నామినేషన్ ప్రక్రియ ఉదయం 11.45 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా ఈరోజు హుజూరాబాద్ లో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు.
Next Story