Sat Feb 15 2025 23:48:49 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో మొదలైన 144 సెక్షన్
తెలంగాణలో 144 సెక్షన్ మొదలైంది. ఎన్నికలు ముగిసే వరకూ 144 సెక్షన్ ను

తెలంగాణలో 144 సెక్షన్ మొదలైంది. ఎన్నికలు ముగిసే వరకూ 144 సెక్షన్ ను అమలు చేయనున్నారు అధికారులు. అయిదుగురు మించి ఎక్కడైనా కనిపిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు లిక్కర్ అమ్మకాలను ఆపివేశారు. బార్లు, వైన్ షాపులు పబ్ మూసివేస్తూ అధికారులు ఆదేశాలను జారీ చేశారు.
రాచకొండ కమిషనరేట్లో ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు సీపీ డీఎస్ చౌహన్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 8వేల మంది పోలీసులు, 25 కంపెనీల కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఓటర్లు ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న రాచకొండ సీపీ డీఎస్ చౌహన్. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు అమలు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ వర్తించనుంది. ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
Next Story