Tue Mar 17 2026 17:31:56 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు మూడు చోట్ల రేవంత్ ప్రచారం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బోథ్, నిర్మల్, జనగాం నియోజకవర్గాల్లో ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా రాష్ట్ర మంతటా పర్యటిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. అందుకే రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అభ్యర్థులను పరిచయం చేస్తూ ఎన్నికల ప్రచారంలో వేగాన్ని పెంచారు.
ఆరు గ్యారంటీలను...
ఎన్నికల ప్రచారానికి ఇంకా పదమూడు రోజులు మాత్రమే ఉండటంతో రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీలు ఇస్తు ప్రజలను తమ వైపునకు తిప్ప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రం వరకూ వరసగా మూడు సభల్లో పాల్గొంటారు. రేవంత్ సభలకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story

