Sun Feb 01 2026 08:13:12 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్ పర్యటన
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రచారాన్ని నిర్వహించనున్నారు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో కాంగ్రెస్ రాష్ట్ర నేతల నుంచి అగ్ర నేతల వరకూ వేగం పెంచారు. వరస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోల ద్వారా ప్రజల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. దీంతో రానున్న నాలుగు రోజులు తెలంగాణ ప్రచారంతో మరింత వేడెక్కనుంది.
వరస పర్యటనలతో...
ఈరోజు రేవంత్ రెడ్డి నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అక్కడ జరిగే ప్రచార సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం పదకొండు గంటలకు నకిరేకల్, మధ్యాహ్నం ఒంటి గంటకు తుంగతుర్తి, మధ్యాహ్నం రెండు గంటలకు ఆలేరు,3.30 గంటలకు ఆలేరు లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, బీబీపేట రోడ్ షోలలో పాల్గొననున్నారు.
Next Story

