Thu Dec 18 2025 17:55:51 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు మూడు సభల్లో రేవంత్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఖానాపూర్, ఆదిలాబాద్, రాజేంద్ర నగర్ లలో జరిగే సభల్లో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేవంత్ రెడ్డి సభలకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
ఎన్నికల ప్రచారంలో...
మధ్యాహ్నం 12 గంటలకు ఖానాపూర్, రెండు గంటలకు ఆదిలాబాద్, సాయంత్రం నాలుగు గంటలకు రాజేంద్ర నగర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ నేతలంతా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జిల్లాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story

