Thu Mar 19 2026 09:27:24 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు కొడంగల్లో రేవంత్ ప్రచారం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ నియోజకవర్గంలో నాలుగు సభల్లో పాల్గొననున్నారు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు నాలుగు సభల్లో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ఆయన పాల్గొననున్నారు. నేడు కొడంగల్ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కొడంగల్ నుంచి ఆయన అభ్యర్థిగా బరిలో ఉండటంతో తనను ఈసారి ఆశీర్వదించాలని ప్రజలను రేవంత్ రెడ్డి కోరనున్నారు.
నాలుగు సభల్లో...
ఉదయం పదిగంటలకు ఆయన ప్రచారం ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దౌల్తాబాద్, మద్దూరు, గుండుమాల్, కోస్గి లలో జరిగే కార్నర్ మీటింగ్లలో ఆయన పాల్గొననున్నారు. రేవంత్ రెడ్డి సభల కోసం పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమితో రేవంత్ రెడ్డి ఈసారి గెలుపు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Next Story

