Wed Mar 18 2026 18:18:22 GMT+0530 (India Standard Time)
KCR : నేడు కేసీఆర్ టూర్ షెడ్యూల్ ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. నేడు మూడు ప్రాంతాల్లో పర్యటించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. అందరికంటే ముందుగా ప్రచారాన్ని చేసి ప్రజల్లోకి వెళ్లాలన్నది ఆయన ప్రయత్నం. రోజుకు రెండు, మూడు సభల్లో ఆయన ప్రసంగిస్తూ ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ హీటెక్కిస్తున్నారు. కేసీఆర్ మాత్రం కేవలం ప్రజాశీర్వద సభల్లో పాల్గొంటూ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు.
మూడు ప్రాంతాల్లో...
అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఏంటో చెబుతున్నారు. అభ్యర్థుల వెనక ఉన్న పార్టీలను చూడమంటున్నారు. గుణగణాలను పరిశీలించమంటున్నారు. మరోసారి బీఆర్ఎస్ అధికారం ఇస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, లేకుంటే అవి ఆగిపోయే అవకాశముందని పరోక్షంగా ప్రజలను హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు పాలకుర్తి, నాగార్జున సాగర్, ఇబ్రహీంపట్నం సభల్లో పాల్గొంటారు. సభలకు సంబంధించి పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం నుంచి కేసీఆర్ సభలు ప్రారంభం కానున్నాయి.
Next Story

