Thu Dec 18 2025 07:35:46 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కాంగ్రెస్కు బిగ్ షాక్... పొన్నాల లక్ష్మయ్య రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జనగామ టిక్కెట్ దక్కదని తెలిసిన ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా లేఖను పంపారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని లేఖలో పొన్నాల పేర్కొన్నారు. కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేస్తుందని ఆరోపిస్తూ తన ప్రాధమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
జనగామ టిక్కెట్...
జనగామ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన మనస్తాపం చెందినట్లు తెలిసింది. సీనియర్ మంత్రిగా తనకు టిక్కెట్ ఇవ్వకుండా కొందరు అడ్డుకుంటున్నారన్న ఉద్దేశ్యంతోనే పొన్నాల రాజీనామా అని చెబుతున్నారు. పొన్నాల లక్ష్మయ్య రాజీనామా పార్టీలో కలకలం రేపింది. ఇది ఎన్నికల సమయంలో పార్టీకి తలనొప్పిగానే చెప్పాలి. అయితే ఆయన బీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. కానీ జానారెడ్డి పొన్నాలతో మాట్లాడి సర్ది చెబుతారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
Next Story

