Fri Mar 20 2026 13:52:26 GMT+0530 (India Standard Time)
Telangana Elections : నేడు నామినేషన్ల పరిశీలన
తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేడు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది

తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేడు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 10వ తేదీ వరకూ తెలంగాణలో దాఖలయిన నామినేషన్ల పరిశీలన నేడు జరగనుంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 2,327 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన అభ్యర్థులు మాత్రమే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో బరిలో ఉన్నారు.
పరిశీలన తర్వాత...
ఈ నామినేషన్ల పరిశీలన తర్వాత ఎందరివి సక్రమంగా ఉన్నాయన్నది తేలనుంది. మరోవైపు ఈ నెల 15వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకోవాలని బుజ్జగిస్తున్నారు. ఈరోజు జరిగే పరిశీలనలో ఎన్ని నామినేషన్లు ఓకే అవుతాయి? ఎన్ని తిరస్కరణకు గురవుతాయన్నది త్వరలో తేలనుంది.
Next Story

