Tue Mar 17 2026 19:35:02 GMT+0530 (India Standard Time)
Rahul Gandhi : నేడు ఐదు సభల్లో రాహుల్ ప్రచారం
ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. మొత్తం ఐదు సభల్లో ఆయన పాల్గొంటారు

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి సమయం ముగుస్తున్న సమయంలో అన్ని పార్టీలూ వేగాన్ని పెంచాయి. ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. మొత్తం ఐదు సభల్లో ఆయన పాల్గొంటారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న రాహుల్ ఈరోజు తెలంగాణకు రానున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పాటు అధికార పార్టీలపై విమర్శలు చేయనున్నారు.
ఎన్నికల ప్రచారంలో...
ఈరోజు రాహుల్ గాంధీ పినపాక, పరకాల, వరంగల్, తూర్పు నియోజకవర్గం, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, రాజేంద్ర నగర్ లలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. హెలికాప్టర్ ద్వారా ఆయన పర్యటన కొనసాగుతుంది. వరంగల్ లో పాదయాత్రలో కూడా రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా భారీ జనసమీకరణ దిశగా నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభల్లో పాల్గొన్న అనంతరం తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళతారు.
Next Story

