Thu Feb 06 2025 17:15:22 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : మూడు రోజులు తెలంగాణలోనే
ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పలుమార్లు తెలంగాణకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ టూర్ షెడ్యూల్ ఖరారయింది. ఇందుకోసం తెలంగాణ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ ప్రచారంలో ఎలాంటి హామీలు ఇస్తారన్న ఆసక్తి నెలకొంది.
వరస సభలతో...
ఈ నెల 25, 26, 27 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. మొత్తం ఆరు సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. 25వ తేదీన మహేశ్వరం, కామారెెడ్డి సభల్లో మోదీ పాల్గొంటారు. 26వ తేదీన తూఫ్రాన్, నిర్మల్ లో జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 27న మహబూబ్ నగర్, కరీంనగర్ సభల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆరోజు సాయంత్రం హైదరాబాద్ లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story