Wed Feb 19 2025 21:37:12 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ నలుగురికి మంత్రి పదవులు
దళితులను కేసీఆర్ తొమ్మిదేళ్లుగా అన్ని రకాలుగా మోసం చేశాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

దళితులను కేసీఆర్ తొమ్మిదేళ్లుగా అన్ని రకాలుగా మోసం చేశాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని ప్రజా ధనాన్ని దోచుకున్నారని ఆయన ఆరోపించారు. స్టేషన్‌ఘన్‌పూర్ లో జరిగిన కాంగ్రెస్ విజయ భేరీ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ను బీఆర్ఎస్ నేతలే నమ్మరని అన్న రేవంత్ కారు పార్టీ కేబినెట్ లో దళితులకు స్థానం లేదన్నారు. ఏం చేశారని మూడోసారి అధికారం ఇవ్వాలని రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు.
మోసం చేయడం...
మహిళలకు కూడా అన్ని రకాలుగా నమ్మించి మోసం చేయడం బీఆర్ఎస్ వంతని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మహిళలకు ఆరుగురికి మాత్రమే టిక్కెట్ ఇచ్చిందని, కాంగ్రెస్ పన్నెండు మంది మహిళలకు టిక్కెట్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నలుగురు మహిళలకు మంత్రిపదవులు గ్యారంటీగా ఇస్తామని రేవంత్ ప్రకటించారు. స్టేషన్ ఘన్పూర్ కు డిగ్రీ కళాశాల తెచ్చే బాధ్యత తనదేనని ఆయన అన్నారు. బెల్ట్ షాపుల్లో తప్ప రాష్ట్రం ఎందులో ముందుందో చెప్పాలని రేవంత్ నిలదీశారు.
Next Story