Thu Dec 18 2025 17:51:49 GMT+0000 (Coordinated Universal Time)
KCR : మోస పోతే గోసపడతాం.. జాగ్రత్తగా ఓటేయ్యండి
కాంగ్రెస్ కు ఓటేస్తే పాతపద్ధతి వస్తుందని, ప్రజలు ఆగమాగం అవుతారని అన్నారు. కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు

కాంగ్రెస్ కు ఓటేస్తే పాతపద్ధతి వస్తుందని, ప్రజలు ఆగమాగం అవుతారని అన్నారు. కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని తెలిపారు. ధరణి లేకుంటే రైతు బంధు డబ్బులు ఖాతాల్లో పడటం కష్టమని తెలిపారు. ధరణి ఉన్నంత కాలం దళారీలు లేకుండా కార్యాలయాలకు పోకండా మీకు డబ్బులు చేరుతున్నాయన్నారు. మోస పోతే గోస పడతామని అన్నారు. ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ కోరారు.
కాంగ్రెస్ పొరపాటున...
రైతు బంధు కూడా కాంగ్రెస్ వస్తే తీసేస్తారని అన్నారు. దళిత సోదరులకు దళిత బంధు పథకాన్ని తెచ్చామని, కాంగ్రెస్ వస్తే అది కూడా ఇవ్వరని చెప్పారు. కాంగ్రెస్ పొరపాటున గెలిస్తే కరెంటుకు రాం రాం చెప్పాల్సిందేనని అన్నారు. దళిత బంధుకు జైభీం అని అనాల్సిందేనని తెలిపారు. ఉద్యోగులు, బీసీలు అందరూ ఏకమై జైపాల్ యాదవ్ ను గెలిపించాాలని కోరారు. వేరే వాళ్లు గెలిస్తే మీకు లాభం లేదని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా కల్వకుర్తి నియోజకవర్గానికి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని తెలిపారు. కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేస్తానని తెలిపారు.
Next Story

