Tue Mar 17 2026 17:42:13 GMT+0530 (India Standard Time)
Rahul Gandhi : రాహుల్ రాకతో ఆ మూడు జిల్లాల్లో
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. నేడు మూడు జిల్లాల్లో రాహుల్ పర్యటన కొనసాగుతుంది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. నేడు మూడు జిల్లాల్లో రాహుల్ పర్యటన కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన తన ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఈరోజు నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఎన్నికల ప్రచారంలో...
బోధనలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అంబంగేట్ గ్రౌండ్ లో సభ జరగనుంది. అనంతరం మధ్యాహ్నం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో జరిగే సభలోనూ రాహుల్ గాంధీ పాల్గొంటారు. అక్కడి నుంచి ఆదిలాబాద్ కు బయలుదేరి వెళతారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం రాష్ట్ర స్థాయి నేతలతో మాట్లాడి ఎన్నికల పరిస్థితులపై చర్చిస్తారు. వారికి దిశానిర్దేశం చేయనున్నారు. రాహుల్ గాంధీ పర్యటన కోసం నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story

