Thu Mar 19 2026 23:21:07 GMT+0530 (India Standard Time)
Priyanka Gandhi : నేడు తెలంగాణకు ప్రియాంక
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈరోజు, రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈరోజు, రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటిస్తారు. అక్కడ జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం 130 గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ, సాయంత్రం మూడు గంటలకు జరిగే కొత్తగూడెంలో నిర్వహించే ర్యాలీలో ప్రియాంక గాంధీ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాత్రికి ఖమ్మంలోనే...
కొత్తగూడెంలో సీపీఐ మద్దతుగా ప్రచారం నిర్వహించనున్న ప్రియాంక గాంధీ ఈరోజు రాత్రికి ఖమ్మం లోనే బస చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పాలేరు నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఉదయం పదకొండు గంటలకు పాలేరు వెళతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సత్తుపల్లి నియోజకవర్గంలోనూ ఆ తర్వాత మధిర నియోజకవర్గంలో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారు. ప్రియాంక గాంధీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధిర ర్యటన తర్వాత నేరుగా విజయవాడ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
Next Story

