Fri Mar 20 2026 01:06:00 GMT+0530 (India Standard Time)
KCR : నేడు మూడు జిల్లాల్లో కేసీఆర్ పర్యటన
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా పన్నెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో కేసీఆర్ మరింత స్పీడ్ పెంచారు. రోజుకు మూడు జిల్లాలను చుట్టివస్తూ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. బీఆర్ఎస్ కు మూడోసారి అధికారం ఇవ్వాల్సిన అవసరం ఎందుకన్నది ఆయన వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జరిగే నష్టమిదీ అని చెబుతున్నారు.
ఈరోజు ఇక్కడ...
ఈరోజు కేసీఆర్ మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గం, నిజిమాబాద్ రూరల్ నియోకవర్గంలో ఆయన ప్రచార సభలు ఉన్నాయి. ఈ మేరకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా జనసమీకరణ చేస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చుట్టి వస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Next Story

