Thu Feb 13 2025 02:14:35 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు నాలుగు సభల్లో పాల్గొననున్న కేసీఆర్
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నేడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించనున్నారు.

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నేడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు మ్యానిఫేస్టోను విడుదల చేసి అందరికంటే ముందున్న కేసీఆర్ ప్రచారంలో కూడా దూసుకువెళుతున్నారు. రోజుకు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటూ మూడోసారి తనకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం కావాలంటే మరోసారి కారు పార్టీకే ఓటు వేయాలని కోరుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో...
ఈరోజు కేసీఆర్ మానకొండూరు, స్టేషన్‌ఘన్‌పూర్, నల్లగొండ నకిరేకల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆయన స్పీడ్ పెంచారు. అన్ని నియోజకవర్గాలను కవర్ చేసి ప్రజలను కారు పార్టీ వైపు మళ్లించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. కాంగ్రెస్ పై ఆయన ప్రధానంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ కు అధికారం వస్తే జరగబోయే పరిస్థితులను వివరిస్తూ ఆయన ప్రచారం సాగుతుంది.
Next Story