Wed Feb 12 2025 23:46:29 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు ఆదిలాబాద్‌కు కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మూడు చోట్ల జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మూడు చోట్ల జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం పేరిట ప్రజా ఆశీర్వాదసభల్లో వరసగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. రోజుకు మూడు సభల్లో ప్రసంగిస్తూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రచారం పూర్తయ్యే లోపు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.
మూడు చోట్ల...
ఈరోజు సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో జరిగే ప్రజాఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మూడు నియోజకవర్గాల నేతలు సభలకు భారీ జనసమీకరణ చేస్తున్నారు. కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న కేసీఆర్ పర్యటనలు రానున్న కాలంలో మరింత ఉధృతమయ్యే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థులను కాకుండా పార్టీని చూసి ఓటేయాలని ప్రజలను కేసీఆర్ పదే పదే కోరుతున్నారు.
Next Story