Tue Dec 16 2025 08:21:13 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు మూడు సభల్లో కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడు రోజుల విరామం తర్వాత తిరిగి నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడు రోజుల విరామం తర్వాత తిరిగి నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ఇంకా పదిహేడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో నేటి నుంచి మళ్లీ జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయనున్నారు. బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థులను ప్రకటించి స్వయంగా కేసీఆర్ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అయితే దీపావళి పండగ నిమిత్తం కొద్దిరోజుల పాటు విరామాన్ని ప్రకటించారు.
ప్రజాశీర్వాద సభలకు...
ప్రతి రోజు రెండు లేదా మూడు నియోజకవర్గాల్లో ప్రజాఆశీర్వద సభలకు హాజరై ప్రసంగాలు చేస్తూ తనకు ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్ పై కేసీఆర్ విరుచుకుపడుతున్నారు. ఈ నెల 28వ తేదీ వరకూ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. మొత్తం 54 సభల్లో ఆయన పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు కేసీఆర్ దమ్మపేట, నర్సంపేట, బూర్గంపహాడ్ సభల్లో పాల్గొననున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను నేతలు పూర్తి చేశారు. భారీ జనసమీకరణకు సిద్ధమయ్యారు.
Next Story

