Sat Mar 07 2026 22:18:08 GMT+0530 (India Standard Time)
KCR : నేడు కేసీఆర్ మూడు నియోజకవర్గాల్లో ప్రచారం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మూడు సభల్లో పాల్గొననున్నారు. ఎల్లారెడ్డి, బోధన్, నిజామాబాద్ లలో ఆయన పర్యటించనున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఎల్లారెడ్డి, బోధన్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ప్రజాశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఇందుకు నేతలు తగిన ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో జనసమీకరణ చేస్తున్నారు. కేసీఆర్ సభల్లో కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు.
కాంగ్రెస్ ను టార్గెట్...
ప్రజలు చైతన్యం కావాలని కోరుతున్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని, అందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటలే కరెంట్ వస్తుందని, పథకాలు కూడా అందవని ప్రజలను హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
Next Story

