Fri Mar 20 2026 07:44:45 GMT+0530 (India Standard Time)
KCR : నేడు మూడు సభల్లో కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన పర్యటన సాగుతుంది. కేసీఆర్ సభల్లో నిన్న బుల్లెట్లు కనిపించిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరినీ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వేదికపైకి పార్టీ నేతలు చెప్పిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. వారిని కూడా తనిఖీలు చేసిన అనంతరం పంపుతున్నారు.
క్షుణ్ణంగా పరిశీలించిన...
ఈరోజు మధ్యాహ్నం తొలుత కరంనగర్ సభలో ఆయన పాల్గొననున్నారు. చొప్పదండి ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగే ప్రచారంలో ఆయన పాల్గొంటారు. తర్వాత హూజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట లో జరిగే సభకు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ప్రచారంలో స్పీడ్ పెంచిన కేసీఆర్ ఈ నెల 28వ తేదీ వరకూ రోజుకు మూడు సభల చొప్పున రాష్ట్రంలో ముఖ్యమైన నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయించారు.
Next Story

