Thu Feb 13 2025 03:50:41 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు నాలుగు సభల్లో కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు నాలుగు సభల్లో ప్రసంగించనున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు నాలుగు సభల్లో ప్రసంగించనున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. జోగులాంబ, గద్వాల, నాగర్‌కర్నూలు జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులను చూసి కాకుండా పార్టీని చూసి గెలిపించాలని కేసీఆర్ పదే పదే కోరుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే ఉన్న పథకాలు ఆగిపోతాయని ఆయన ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
మూడు జిల్లాల్లో...
ఈరోజు అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. రోజుకు మూడు చొప్పున నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వస్తున్న కేసీఆర్ ఎన్నికల ప్రచారం గడువు దగ్గరపడుతుండటంతో నేడు నాలుగు చోట్ల హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సభలకు అన్ని ఏర్పాట్లు కారు పార్టీనేతలు పూర్తి చేశారు. భారీగా జనసమీకరణ కు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్,బీజేపీలను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేస్తున్నారు.
Next Story