Thu Mar 19 2026 09:10:28 GMT+0530 (India Standard Time)
KCR : నేడు నాలుగు నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు

తెలంగాణ ఎన్నికల ప్రచారం గడువు దగ్గరపడుతుంది. ఇంకా గంటలు మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అక్టోబరు 15వ తేదీ నుంచి ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సభల్లో పాల్గొంటూ ప్రజలు తనకు మరొక అవకాశం ఎందుకు ఇవ్వాలో వివరిస్తున్నారు.
ప్రచారం ముగియనుండటంతో...
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. బీజేపీని కూడా వదలకుండా విమర్శలు చేస్తూ తన ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ కేసీఆర్ షాద్నగర్, చేవెళ్ల, ఆంధోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. మూడోసారి తనకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే నష్టాలను వివరిస్తున్నారు. ప్రజలను తన వైపునకు తిప్పుకునేందుకు కేసీఆర్ శ్రమిస్తున్నారు.
Next Story

