Fri Dec 05 2025 18:06:16 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు నాలుగు సభల్లో కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు వరసగా పర్యటనలు చేస్తున్నారు. నేడు నాలుగు సభల్లో పాల్గొననున్నారు

బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు వరసగా పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నేడు నాలుగు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. దాదాపు నెలన్నర నుంచి విస్తృతంగా పర్యటనలు చేస్తూ కేసీఆర్ బీఆర్ఎస్ ను మరోసారి అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో కొనసాగితే ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తూనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే నష్టాలను కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో నిన్నటి వరకూ మూడు సభలకే పరిమితమైన కేసీఆర్ నేడు నాలుగు సభలకు హాజరు కానున్నారు.
కాంగ్రెస్ పై....
నేడు మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో కేసీఆర్ నేడు పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ సభలకోసం నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా జనసమీకరణ చేస్తున్నారు. బీఆర్ఎస్ మ్యానిఫేస్టోతో పాటు కాంగ్రెస్, బీజేపీలపై ఆయన విరుచుకుపడుతున్నారు. ప్రజలకు 24 గంటలు విద్యుత్తు కావాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా బీఆర్ఎస్ కే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు.
Next Story

