Fri Mar 20 2026 07:46:18 GMT+0530 (India Standard Time)
BJP : నేడు బీజేపీ మ్యానిఫేస్టో విడుదల
బీజేపీ మ్యానిఫేస్టోను నేడు విడుదల చేయనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు.

భారతీయ జనతా పార్టీ మ్యానిఫేస్టోను నేడు విడుదల చేయనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు. ఈరోజు హైదరాబాద్ కు చేరుకోనున్న అమిత్ షా తర్వాత హెలికాప్టర్లో గద్వాల్ కు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.45 గంటలకు నల్లగొండకు చేరుకని అక్కడ జరిగే సభలో ఆయన ప్రసంగం చేయనున్నారు.
వరస సభలతో...
ఆ తర్వాత నల్లగొండ నుంచి వరంగల్ కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వరంగల్ నుంచి సాయంత్రం హైదరాబాద్కు చేరుకుని ఆరు గంటలకు సోమాజిగూడలో బీజేపీ మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు. అనంతరం క్లాసిక్ గార్డెన్స్ లో ఎమ్మార్పీఎస్ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత నేరుగా ఢిల్లీ బయలుదేరి వెళతారు.
Next Story

