Fri Dec 05 2025 23:34:12 GMT+0000 (Coordinated Universal Time)
Amit Sha : నేడు అమిత్ షా రాక.. మ్యానిఫేస్టో విడుదలతో పాటు వరస సభలు
నేడు కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రేపు ప్రచార సభల్లో పాల్గొంటారు. మ్యానిఫేస్టో విడుదల చేస్తారు

నేడు కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఇవాళ రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా రేపు ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బీజేపీ మ్యానిఫేస్టోను రేపు ఉదయం పదిన్నర గంటలకు సోమాజీగూడలోని ఒక హోటల్ లో విడుదల చేయనున్నారు. అనంతరం ఆయన ప్రచారానికి బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వరస సభలతో...
అమిత్ షా రేపు గద్వాల్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ ప్రజలకు బీజేపీని గెలిపించాల్సిన అవసరం గురించి వివరిస్తారు. అనంతరం నల్లగొండకు వెళ్లి అక్కడ జరిగే సభలో పాల్గొని పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. తర్వాత వరంగల్ కు చేరుకుంటారు. అక్కడ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ చేరుకుని రాత్రికి సికింద్రాబాద్ లోని ఒక ప్రయివేటు గార్డెన్స్ లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేతలతో సమావేశమవుతారు. ఆ సమావేశం తర్వాత ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
Next Story

