Fri Dec 05 2025 19:56:40 GMT+0000 (Coordinated Universal Time)
Divya Vani : కాంగ్రెస్ లో చేరిన దివ్యవాణి.. ఆ పార్టీలోకే ఎందుకంటే?
సినీనటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె అన్నారు.

సినీనటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె అన్నారు. దివ్యవాణి తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావ్ థాక్రే సమక్షంలో పార్టీలో చేరారు. ఆమెను థాక్రే కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీకి దివ్యవాణి సేవలను ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా థాక్రే తెలిపారు.
టీడీపీకి రాజీనామా చేసి....
దివ్యవాణి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆమె టీడీపీలో చేరి ఆ పార్టీకి మద్దతు ఉన్నారు. మూడేళ్ల పాటు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిన దివ్యవాణి తర్వాత పార్టీ నాయకత్వం వ్యవహారశైలి నచ్చక పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా కాంగ్రెస్ లో చేరి ఆమె మరోసారి క్రియాశీలకం కావాలని కోరుకుంటున్నారు.
Next Story

