Fri Mar 27 2026 10:09:14 GMT+0530 (India Standard Time)
Ontimitta : నేడు ఒంటిమిట్టలో నవమి బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.పురాతన చారిత్రక ప్రాశస్త్యాన్ని కలిగిన ఈ ఆలయంలో ఒకే శిలపై శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్య మూర్తులు వెలసి ఉండటంతో ఒంటిమిట్టను “ఏకశిలానగరం”గా కూడా పిలుస్తారు. ఈ పవిత్రక్షేత్రంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల కోసం ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో ముస్తాబైంది.
నేడు ధ్వజారోహణం...
శుక్రవారం ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. దీంతో శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీరామనవమి ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు పోతన జయంతి కార్యక్రమం, కవి సమ్మేళనం జరుగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష వాహనసేవను భక్తులు వీక్షించనున్నారు.
Next Story

