Fri Sep 13 2024 09:21:39 GMT+0000 (Coordinated Universal Time)
INDvsZIM: సిరీస్ సొంతం చేసుకున్న భారత్
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారతజట్టు జింబాబ్వే పై సిరీస్ గెలిచింది
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారతజట్టు జింబాబ్వే పై సిరీస్ గెలిచింది. నాలుగో టీ20 మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా భారతజట్టు లక్ష్యాన్ని చేధించింది. 153 పరుగుల లక్ష్యాన్ని భారతజట్టు 15.2 ఓవర్లలో చేధించింది. యశస్వి జైస్వాల్ 93 పరుగులతో నాటౌట్ గా నిలవగా.. గిల్ కూడా 58 పరుగులు నాటౌట్ తో నిలిచాడు. సిరీస్ లో ఆఖరి టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారతజట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికిందర్ రజా ఫామ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. రజా 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 46 పరుగులు చేశాడు. జింబాబ్వే ఓపెనర్లు మదివెరే, మరుమని తొలి వికెట్ కు 63 పరుగులు జోడించి శుభారంభం అందించినప్పటికీ భారీ స్కోరు చేయడంలో జింబాబ్వే విఫలమైంది. మదివెరే 25, మరుమని 32 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, తుషార్ దేశ్ పాండే 1, వాషింగ్టన్ సుందర్ 1, అభిషేక్ శర్మ 1, శివమ్ దూబే 1 వికెట్ తీశారు.
Next Story