Fri Mar 20 2026 06:17:28 GMT+0530 (India Standard Time)
నేడు అవార్డు అందుకోనున్న గిల్
యువ క్రికెటర్ శుభమన్ గిల్ నేడు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోనున్నారు

యువ క్రికెటర్ శుభమన్ గిల్ నేడు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోనున్నారు. బీసీసీఐ ఇచ్చే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు శుభమన్ గిల్ కు దక్కింది. అత్యంత వేగంగా వన్డేల్లో రెండు వేల పరుగులు చేయడమే కాకుండా, టీం ఇండియా విజయంలో భాగస్వామిగా నిలిచినందుకు శుభమన్ గిల్ కు ఈ అవార్డు ఇవ్వనున్నారు.
రవిశాస్త్రి కూడా...
హైదరాబాద్ లో జరిగే అవార్డు ఫంక్షన్ కార్కక్రమంలో బీసీసీఐ నుంచి ఈ అవార్డును స్వీకరించనున్నారు. ఇంగ్లండ్ - భారత్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఎల్లుండి నుంచి హైదరాబాద్ లో జరగనున్న నేపథ్యంలో క్రికెటర్లందరూ హైదరాబాద్ కు చేరుకున్నారు. జై షా కూడా వచ్చారు. ఇదే ఫంక్షన్ లో టీం ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వనున్నారు.
Next Story

