Sat Nov 08 2025 00:04:49 GMT+0000 (Coordinated Universal Time)
Women Cricket : ఒక్కసారిగా పెరిగిన క్రేజ్.. ఒక రేంజ్ కు వెళ్లిన ఉమెన్ క్రికెట్
వన్డే మహిళల ప్రపంచ కప్ తో ఒక్కసారిగా మహిళా క్రికెట్ కు కూడా ఫ్యాన్స్ అమాంతం పెరిగిపోయారు

భారత్ లో ఇప్పటి వరకూ పురుషుల క్రికెట్ కే ఎక్కువ ఆసక్తి ఉంది. పురుషులు ఆడే టెస్ట్ మ్యాచ్ అయినా, వన్డే అయినా, టీ 20 అయినా దానికి వ్యూయర్ షిప్ ఎక్కువ. వారికి బీసీసీఐ ఇచ్చే పారితోషికంతో పాటు అత్యధిక వేతనాలు కూడా ఉన్నాయి. ఇన్నాళ్లూ మహిళల భారత జట్టు కొన్నేళ్ల నుంచి ఆడుతున్నప్పటికీ వారి ఆట పట్ల పెద్దగా ఆసక్తి కనపర్చలేదు. అయితే ఇటీవల జరిగిన వన్డే మహిళల ప్రపంచ కప్ తో ఒక్కసారిగా మహిళా క్రికెట్ కు కూడా ఫ్యాన్స్ అమాంతం పెరిగిపోయారు. ఏ రేంజ్ లో అంటే మెన్ క్రికెట్ లో ఉన్నట్లే మహిళల జట్టులో కూడా ఆటగాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.
ప్రపంచ కప్ లో విజయం తర్వాత...
మహిళల ప్రపంచ కప్ లో భారత్ ఛాంపియన్ గా నిలిచిన తర్వాత మరింత పెరిగింది. అందులోనూ సెమీ ఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్ లకు స్టేడియాలు ప్రేక్షకులతో నిండిపోయాయి. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. పురుషుల జట్టుకు ధీటుగా మహిళ క్రికెట్ కూడా ఇప్పుడు భారత్ లో రూపుదిద్దుకుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధానా, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఇలా ప్రతి ఒక్కరికీ ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. వారి సోషల్ మీడియా అకౌంట్లలో కూడా ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది.
మైదానంలో...
ప్రపంచ కప్ లో విజయం సాధించడంతో వారి బ్రాండ్ వాల్యూ వంద శాతానికి చేరుకుందన్న లెక్కలు వినిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లోపురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆడుతున్న తీరు వారికి ఇమేజ్ తో పాటు క్రేజ్ నుమరింత పెంచినట్లయింది. సిక్సర్లు, ఫోర్లు కొట్టే తీరుకు కూడా మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. ఇక బౌలింగ్ లో నైపుణ్యం కూడా మెరుగుపర్చుకోవడం, మైదానంలో క్యాచ్ లు పట్టే తీరు కూడా ఇప్పటి వరకూ వస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లయింది. ఇక మహిళల క్రికెట్ ను కూడా అదే రేంజ్ లో వ్యూయర్ షిప్ పెరిగే అవకాశముండటంతో వరసగా సిరీస్ ను కూడా నిర్వహించేందుకు ఐసీసీ, బీసీసీఐలు సిద్ధమవుతున్నాయి.
Next Story

