Mon Mar 30 2026 13:52:16 GMT+0530 (India Standard Time)
ఆరు వికెట్ల దూరంలో విజయం
సెంచూరియన్ టెస్ట్ లో ఎవరిది గెలుపన్నది ఉత్కంఠగా మారింది. నేడు ఐదో రోజు మ్యాచ్ జరగనుంది. ఫలితం తేలనుంది.

సెంచూరియన్ టెస్ట్ లో ఎవరిది గెలుపన్నది ఉత్కంఠగా మారింది. నేడు ఐదో రోజు మ్యాచ్ జరగనుంది. ఫలితం తేలనుంది. దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే ఇంకా 211 పరుగులు చేయాల్సి ఉంది. అలాగే భారత్ విక్టరీ కొట్టాలంటే ఆరు వికెట్లను తీయాల్సి ఉంది. ఈ రెండు జరగకపోతే గేమ్ డ్రాగా ముగిసే అవకాశముంది.
ఇదీ లక్ష్యం....
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 94 పరుగులు స్కోరు చేసింది. భారత్ నాలుగు వికెట్లను తీసింది. ఇక దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 305 పరుగులు కావడంతో మరో 211 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ కూడా విజయానికి ఆరు వికెట్ల దూరంలో ఉంది. మొత్తం మీద ఈ టెస్ట్ ఉత్కంఠ భరితంగానే కొనసాగుతుంది.
Next Story

