భారత్ కు రాలేము: బంగ్లాదేశ్ జట్టు
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు వెళ్లకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ యువజన, క్రీడల శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కొనుగోలు చేసిన బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను బీసీసీఐ సూచనల మేరకు జట్టు నుంచి తప్పించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించి, భారత్ పర్యటనను బహిష్కరించాలని నిర్ణయించింది. భారత క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న దూకుడు విధానాల వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, కాంట్రాక్టు ఉన్న ఆటగాడికే అక్కడ అనుమతి లేనప్పుడు, మా జాతీయ జట్టుకు రక్షణ ఉంటుందని తాము భావించడం లేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో కోల్‌కతా, ముంబై వేదికగా జరగాల్సిన బంగ్లాదేశ్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చే అవకాశం ఉంది.

