Thu Mar 19 2026 04:11:41 GMT+0530 (India Standard Time)
Breaking : షాకింగ్.. కొహ్లికి గాయం.. రేపు ఆడతాడా?
విరాట్ కొహ్లికి స్వల్ప గాయమయింది. నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా కొహ్లికి గాయమయినట్లు తెలిసింది

సెమీ ఫైనల్స్ జరుగుతున్న నేపథ్యంలో టీం ఇండియాకు ఇబ్బందులు ఎదురువుతునట్లే కనపడుతుంది. విరాట్ కొహ్లికి స్వల్ప గాయమయింది. నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా విరాట్ కొహ్లికి గాయమయినట్లు తెలిసింది. దీంతో కొహ్లి ఈరోజు నెట్ ప్రాక్టీస్ కు కొద్ది సేపు దూరంగా ఉన్నారు.
హర్షల్ పటేల్ బౌలింగ్ లో...
హర్షల్ పటేల్ బౌలింగ్ చేసే సమయంలో కొహ్లికి గాయమయిందని చెబుతున్నారు. అయితే పెద్ద గాయమేమీ కాదని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని టీం ఇండియా మేనేజ్్మెంట్ చెబుతుంది. రేపు ఇంగ్లండ్ తో భారత్ సెమీ ఫైనల్స్ ఆడాల్సి ఉంది. నిన్ననే కెప్టెన్ రోహిత్ శర్మ ముంజేయికి గాయమయింది. ఈరోజు విరాట్ కొహ్లికి గాయం కావడంతో భారత్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.
Next Story

