భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఇంట తీవ్ర విషాదం
1972 మ్యూనిచ్ ఒలింపిక్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత హాకీ జట్టులో సభ్యుడు, టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ తండ్రి అయిన మాజీ భారత హాకీ ఆటగాడు వెసీ పేస్ (80) గురువారం మరణించారు.

1972 మ్యూనిచ్ ఒలింపిక్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత హాకీ జట్టులో సభ్యుడు, టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ తండ్రి అయిన మాజీ భారత హాకీ ఆటగాడు వెసీ పేస్ (80) గురువారం మరణించారు. మీడియా కథనాల ప్రకారం.. వెస్ పేస్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం ఆయనను కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు.
వెస్ పేస్ భారత హాకీ జట్టులో మిడ్‌ఫీల్డర్‌గా ఆడేవారు. ఇది కాకుండా ఆయన ఫుట్‌బాల్, క్రికెట్, రగ్బీ వంటి అనేక క్రీడలకు తన సహకారం అందించారు. వెస్ పేస్ 1996 నుండి 2002 వరకు ఇండియన్ రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్‌గా ఆయనకు పేరుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, ఇండియన్ డేవిస్ కప్ జట్టుతో సహా అనేక క్రీడా సంస్థలకు వైద్య సలహాదారుగా పనిచేశారు.
1972లో ఒలింపిక్స్‌లో హాకీ జట్టుకు పతకం సాధించిన వెస్ పేస్ కుమారుడు లియాండర్ పేస్ 24 ఏళ్ల తర్వాత 1996లో అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్‌కు తొలి ఏకైక పతకాన్ని అందించాడు. పురుషుల సింగిల్స్‌లో లియాండర్ కాంస్య పతకాన్ని సాధించాడు. 1952 తర్వాత ఒలింపిక్ వ్యక్తిగత క్రీడల్లో భారత్‌కు ఇదే తొలి పతకం. 1952లో KD జాదవ్ రెజ్లింగ్‌లో పతకం గెలిచాడు. వెస్ తన కొడుకు లియాండర్ను ఎప్పుడూ మెచ్చుకునేవారు. ఈ ఇద్దరు తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం చాలా లోతైనది.

