Sat Mar 28 2026 05:56:52 GMT+0530 (India Standard Time)
చెలరేగిన వైభవ్ సూర్య వంశీ... భారత్ భారీ స్కోరు
అండర్ 19 వరల్డ్ కప్ లో టీం ఇండియా భారీ స్కోరు చేసింది

అండర్ 19 వరల్డ్ కప్ లో టీం ఇండియా భారీ స్కోరు చేసింది. యాభై ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 411 చేసింది. ఇంగ్లండ్ లక్ష్యం 412 పరుగులుగా ఉంది. వైభవ్ సూర్య వంశీ చెలరేగి ఆడటంతో ఈ స్కోరు సాధ్యమయింది. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. దీంతో భారత్ భారీ పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది.
యాభై ఐదు బంతుల్లోనే సెంచరీ...
వైభవ్ సూర్యవంశీ కేవలం యాభై ఐదు బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. పదిహేను సిక్సులు, పదిహేను ఫోర్లతో బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతోనే భారత్ భారీ పరుగులు చేయగలింది. అభిజ్ఞాన్ కుందు నలభై పరుగులు, వేదాంత్ త్రివేది 32 పరుగులు, విహాన్ మల్హోత్రా 30 పరుగులు చేశారు. అయితే టీం ఇండియా బౌలర్లు కూడా సరైన సమయంలో వికెట్లు తీయగలిగితే వరల్డ్ కప్ టీం ఇండియా ముద్దాడనుంది.
Next Story

